నెల్లూరు జిల్లా టాపర్‌గా యశస్విత

7చూసినవారు
నెల్లూరు జిల్లా టాపర్‌గా యశస్విత
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రాణించారు. చేజర్ల మండలం నాగులవెల్లటూరూ జడ్పీ విద్యార్థిని యశస్వి 595 మార్కులతో జిల్లా టాపర్‌గా అవతరించింది. దుత్తలూరు మోడల్ స్కూల్ విద్యార్థిని చెరుకూరి కరీనా, గుమ్మలదిబ్బ విద్యార్థిని అపర్ణ 594 మార్కులతో ద్వితీయ స్థానం సాధించగా, నందవరం మోడల్ స్కూల్ విద్యార్థి గోవర్ధన్ 593 మార్కులతో సత్తాచాటారు. ఈ ఫలితాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.

సంబంధిత పోస్ట్