
నెల్లూరు: సుబ్బరామిరెడ్డి పార్క్ ను ప్రారంభించిన నారాయణ
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం నెల్లూరు 14వ డివిజన్లోని ఏసీ నగర్ లో రూ. 25 లక్షలతో ఆధునికరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును ప్రారంభించారు. ప్రజల మానసిక ఉల్లాసానికి పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కాలువలను మరమ్మతులు చేయడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మంత్రికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.






































