
నెల్లూరు: కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 25/3 సమతా నగర్ వార్డు సచివాలయం వార్డ్ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎస్కే నాయబ్, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ ఆదివారం అతన్ని సస్పెండ్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు లాగిన్ ఇచ్చి ప్రభుత్వ సేవలను దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదుపై ఈ చర్య తీసుకున్నారు.



































