
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 53 అర్జీలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించారు. కమిషనర్ వై. ఓ. నందన్ అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందిస్తామని కమిషనర్ తెలిపారు. అర్హులైన వారు టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.






































