
నేటితో నెల్లూరులో రొట్టెల పండుగ..
ఐదురోజుల పాటు జరిగిన రొట్టెల పండుగ మంగళవారం ముగియనుంది. జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో ఆరోగ్యం, విద్య, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం కోసం రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ నెల 26న సొందలిమాలి, 27న గంధమహోత్సవం, 28న రొట్టెల పండుగ, 29న తహలీల్ ఫాతెహా నిర్వహించారు. మంగళవారం ముగింపు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులకు అవార్డులు అందజేయనున్నారు.




































