నెల్లూరులోని సర్వేపల్లి కాలువలో సుమారు 30-35 ఏళ్ల వయస్సు గల ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు లైట్ బ్లూ కలర్ షార్ట్, బ్లూ కలర్ టీషర్ట్ ధరించి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.