బద్వేల్ హైవేపై మూగజీవాల మృతి, బైకర్లకు గాయాలు

67చూసినవారు
బద్వేల్ హైవేపై మూగజీవాల మృతి, బైకర్లకు గాయాలు
కడప జిల్లా బద్వేల్ నేషనల్ హైవే 67 బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం పశువులను ఢీకొనడంతో నాలుగు మూగజీవాలు మృతి చెందాయి. రోడ్డుపై పడి ఉన్న పశువుల కళేబరాలను గమనించక బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాటిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బద్వేల్ రూరల్ ఎస్సై రంగారావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్