శుక్రవారం నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు నోటీసులు అందజేశారు. సోమశిల జలాశయం సందర్శనకు వెళ్లే క్రమంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.