రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం దుబాయ్‌లో పర్యటిస్తోంది. అక్కడ ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు బిజీ కృష్ణన్, సెలీనా శశికాంత్ లతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. దుబాయ్ పర్యటన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కాన్సుల్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్త తో మంత్రి నారాయణ వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ తో లంచ్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు.