నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామం నుండి ఉప్పుటూరు గ్రామం వరకు 2.65 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ప్రధాన రహదారి పనులను యూపంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ అధికారులతో కలిసి టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులకు దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు.