నెల్లూరు: సిసి డ్రైన్ పనులకు గిరిధర్ రెడ్డి శంకుస్థాపన

2చూసినవారు
నెల్లూరు: సిసి డ్రైన్ పనులకు గిరిధర్ రెడ్డి శంకుస్థాపన
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్, బ్యాంక్ కాలనీలో మంగళవారం 19 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 23వ డివిజన్‌లో 6.50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశానని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్