నెల్లూరు: గడ్డి మందు తాగి ఒకరు ఆత్మహత్య

6చూసినవారు
నెల్లూరు: గడ్డి మందు తాగి ఒకరు ఆత్మహత్య
వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేశారు. పాత వెల్లంటిలో రాపూరు పెద్ద అంకయ్య (84) నివాసం ఉంటున్నారు. ఆయనకు  కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉండడంతో నొప్పులు భరించలేక శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్