కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం తెలిపారు. 12 రోజులు గడపగడపకూ తిరిగిన కార్యకర్తలు, నేతల కృషితో ఇది సాధ్యమైందన్నారు. అమరావతిని అద్భుత రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు నగదు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.