నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మట్టి, డెబ్రిస్ వంటి సామాగ్రిని లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల ద్వారా రవాణా చేసేటప్పుడు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై వాటిని వెదజల్లకుండా తరలించాలని కమిషనర్ వై. ఓ నందన్ సూచించారు. సోమవారం రేబాల వారి వీధి ప్రాంతంలో ఇసుక రవాణా చేస్తున్న ఎద్దుల బండ్ల యజమానితో ఆయన మాట్లాడారు.