ఇందుకూరుపేట మండలంలో T వెంకటసుబ్బయ్య అలియాస్ మణి(31) అనే వ్యక్తి బాలికపై లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికలో శారీరక మార్పులను గమనించిన తల్లి ఆరోగ్య సిబ్బందిని సంప్రదించగా, గర్భం దాల్చిన విషయం తెలిసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు SI నవీన్ కుమార్ గురువారం పోక్సో కేసు నమోదు చేశారు.