నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఈనెల 22వ తేదీన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాసులుపై ఒక ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సు ఎక్కే సమయంలో తోపులాట జరగడంతో, కండక్టర్ తన తల్లిని తోసాడని ఆరోపిస్తూ ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముత్యాలపాలెంలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు నెల్లూరు-1 డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.