నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 5న కేరళకు వెళ్లనున్నారు. న్యూరో సమస్యల కారణంగా ఆయన కాలికట్ సమీపంలోని కొట్టికల్‌లో నెల రోజుల పాటు ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నారు. ఈ సమయంలో ఆయన ఫోన్ కాల్స్‌కు అందుబాటులో ఉండరని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.