ముత్తుకూరు మండలంలోని బ్రహ్మ దేవి సెంటర్ వద్ద శనివారం త్రాగునీరుతో పాటు మజ్జిగ చలివేంద్రాన్ని ఎంపీడీవో నాగమణి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక టిడిపి నాయకులు, సర్వేపల్లి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు షేక్ అలిముత్తు దాతృత్వంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు షేక్ అలిముత్తు సహకారాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు కూడా పాల్గొన్నారు.