జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం

7చూసినవారు
జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం
పొదలకూరు మండలంలోని మొగుళ్ళూరులో జనసేన నాయకులు నాగరాజు, తిరుపతి, కుమార్, ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం వనంతోపు సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నాగరాజు తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకు ఇది కొనసాగుతుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు పాపిశెట్టి విష్ణు, వెంకటేశ్వర్లు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you