రాపూరులో వెలసిన శక్తి స్వరూపిణి శ్రీ రాపూరమ్మ తల్లిని పెంచలకోన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పెంచలకోన ఫెస్టివల్ కమిటీ చైర్మన్‌గా రాపూరమ్మను దర్శించుకోవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.