పిడూరు పాలెంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు

707చూసినవారు
పిడూరు పాలెంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు
మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు సత్యం స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి పంచామృత అభిషేకం, నూతన వస్త్రధారణ, పుష్పాలంకరణ, కుంకుమార్చన అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్