వరద తగ్గుముఖం: వెంకన్నపాలెం రహదారిపై రాకపోకలు పునఃప్రారంభం
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా మనుబోలు మండలం వెంకన్నపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపం నుంచి ఇసుక చేనుల వరకు రోడ్డుపైకి వరద నీరు ప్రవహించడంతో గురువారం, శుక్రవారం రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో జాతీయ రహదారి నుంచి వెంకన్నపాలెం, బద్దెవోలు, పల్లిపాలెం, పిడురుపాలెం, కటవపల్లి, కొలనుకుదురు గ్రామాలకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.
