వరద నీటితో వెంకన్నపాలెం రహదారిపై ఉధృతంగా ప్రవాహం, గ్రామాల రాకపోకలు నిలిపివేత

6చూసినవారు
మనుబోలు మండలం వెంకన్నపాలెం ఇసుక చేను వద్ద, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వరద నీరు పొంగి రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం వెంకన్నపాలెం, బద్దెవోలు, పల్లిపాలెం, పిడూరుపాలెం, కటువపల్లి, కొలనుకుదురు గ్రామాలకు జాతీయ రహదారి నుంచి రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సబ్ స్టేషన్ చుట్టూ వరద నీరు నిలిచిపోవడంతో ఈ గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్