విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్యూ) కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ) రెండో రోజు విజయవంతంగా ముగిసింది. బోధన, పరిశోధన రంగాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై నిపుణులు కీలక అంశాలను వివరించారు. ముఖ్య వక్త, (ఎన్ఐఈపీఏ) ఐసీటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ హెడ్ ఆచార్య కే. శ్రీనివాస్, విద్యా వ్యవస్థలో ఏఐ అనుసంధానం ఆవశ్యకతను నొక్కి చెప్పారు.