మంగళవారం మనుబోలు మండలంలో చలి గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకుని పగలే చీకటిని తలపించాయి. సాయంత్రం చలి తీవ్రత పెరిగి వర్షం కురవడంతో రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.