మనుబోలు మండలంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఇంటి పన్నులు వసూలు చేస్తున్నామని ఎంపీడీవో జలజాక్షి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇంటి పన్నులు వసూలు చేశారు. మనుబోలు మండలంలో మొత్తం రూ. 79.73 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇంకా రూ. 34 లక్షలు రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మండలం మొత్తం 50% పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు.