కండలేరు వాగు పొంగిపొరలింది, వెంకన్నపాలెం సమీపంలో రోడ్డుపైకి నీరు

2290చూసినవారు
తుఫాన్ ప్రభావంతో ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనుబోలు మండలం వెంకన్నపాలెం సమీపంలో కండలేరు వాగు పొంగి రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దాదాపు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రవాహం పెరిగితే జాతీయ రహదారి నుంచి వెంకన్నపాలెం, బద్దెవోలు, పల్లిపాలెం, పిడురుపాలెం, కటవపల్లి, కొలనకుదురు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్