మనుబోలు చెర్లో పల్లి రైల్వే గేటు సమీపాన ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో బుధవారం కార్తీకమాస అమావాస్య సందర్భంగా అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం, పుష్పాలంకరణ, ఎండుఖర్జూరంతో అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలుగా మన్నేపల్లి శ్రీనివాసులు, లక్ష్మీ గార్లు వ్యవహరించారు.