వెంకటాచలంలో కత్తితో దాడి.. దుకాణ యజమానికి తీవ్ర గాయాలు

4చూసినవారు
వెంకటాచలంలో కత్తితో దాడి.. దుకాణ యజమానికి తీవ్ర గాయాలు
వెంకటాచలంలో శుక్రవారం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మిఠాయిల దుకాణం యజమానిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రాజస్థాన్‌కు చెందిన అర్జున్‌దాస్ కసుమూరు రోడ్డులో మిఠాయిల దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణం ఎదురుగా ఆటోలో మద్యం సేవిస్తూ సీసా విసిరిన వ్యక్తిని ప్రశ్నించగా ఆగ్రహంతో కత్తితో పొడిచాడు. గాయపడిన అర్జున్‌దాస్ స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందిన అనంతరం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్