మనుబోలు మండలం పిడూరు పాలెంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అర్చకులు సత్యం స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి పంచామృత అభిషేకం, ఏకరుద్రాభిషేకం, నూతనవస్త్రధారణ, పుష్పాలంకరణ, కుంకుమార్చన చేసి స్వామివారిని అర్ధనారీశ్వరునిగా అలంకరించారు. అనంతరం మధ్యాహ్నం కార్తీక వనభోజనాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించి కార్తీక వనభోజనాలు స్వీకరించారు.