
గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు పాక్షికంగా విమాన సర్వీసులు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అక్కడున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిపోయిన విమాన సర్వీసులు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ సౌదీ అరేబియా, జెడ్డా నుండి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది. గతంలో టికెట్లు బుక్ చేసుకుని, ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రయాణించలేని కస్టమర్ల కోసం ఈ విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.




