పొదలకూరులో కోలాహలంగా మహానాడు...

0చూసినవారు
పొదలకూరులో కోలాహలంగా మహానాడు...
తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం పొదలకూరు మండలంలో ఘనంగా జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని తాటిపర్తిలో ఒకటవ క్లస్టర్ కార్యకర్తల కోసం, పొదలకూరులో రెండు, మూడు క్లస్టర్ల కార్యకర్తల కోసం డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ టిడిపి అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడులు పార్టీ జెండాను ఎగురవేసి, పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్