జిల్లాలోని హాస్టల్ విద్యార్థులు పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అన్నారు. ఆమె మంగళవారం మనుబోలులోని ఎస్సీ బాలుర బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల చదువు, వసతులు, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. రికార్డులను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందజేశారు.