మనుబోలు: గిరిజనులకు నష్ట పరిహారం ఇవ్వాలి

3చూసినవారు
మనుబోలు: గిరిజనులకు నష్ట పరిహారం ఇవ్వాలి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో భూములు కోల్పోయిన గిరిజనులకు నష్ట పరిహారం ఇప్పించాలని జిల్లా గిరిజన సంక్షేమ సంఘ నాయకుడు కేసీ పెంచలయ్య కోరారు. ఈ మేరకు మనుబోలు తహశీల్దార్ రమాదేవికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. పిడూరు గ్రామం సీతారామపురం గిరిజన కాలనీ, లక్ష్మీనరసింహపురం కాలనీలకు చెందిన యానాదులకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి పరిహారం ఇప్పించాలని ఆయన కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.