మానసిక అస్వస్థత కలిగిన మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

265చూసినవారు
మానసిక అస్వస్థత కలిగిన మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
మనుబోలు మండలంలో మానసిక అస్వస్థతతో ఉన్న మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పొదలకూరు సీఐ వెంకట్రావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you