మార్నింగ్ స్టార్ ప్రైవేటు బస్సు బోల్తా..

2569చూసినవారు
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్డవారి మిట్ట వద్ద జాతీయ రహదారిపై మార్నింగ్ స్టార్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బెంగుళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.