ముత్తుకూరు మండల ఆవాజ్ ఉపాధ్యక్షుడు షేక్. సిరాజ్ బుధవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో తలకు గాయమైన ఆయన నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో చెన్నైకి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల అవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె. రహీద్, అధ్యక్షుడు రఫీ సంతాపం తెలిపారు.