ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు బైపాస్ రోడ్డు మార్గంలో పంటపాలెం సమీపాన గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కార్మికుడు రూపు మాజీ ( 22) టిప్పర్ ఢీకొని దుర్మరణం చెందాడు. సంఘటన స్థలంకు పోలీసులు వెళ్లి వివరాలు నమోదు చేశారు. మృతుడు ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.