మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం వద్ద ఆదివారం నాగేంద్రుడు మరోసారి ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు 'ఓం నమశ్శివాయ' అంటూ భక్తి పారవశ్యంతో నిలిచిపోయారు. గతంలో కూడా ఇదే ఆలయం వద్ద నాగుపాములు కనిపించిన విషయం తెలిసిందే. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.