వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ మొహసీన్ సుల్తానా సూచించారు. మనుబోలు ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం ఆమె మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని, క్యాప్ ధరించాలని తెలిపారు. వడదెబ్బ తగిలినప్పుడు తడి గుడ్డతో శరీరాన్ని తుడిచి చల్లని ప్రదేశానికి తరలించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఎక్కువగా తీసుకోవాలని, ఇవి స్థానిక వైద్యశాలల్లో ఉచితంగా లభిస్తాయని చెప్పారు. తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచించారు.