భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జనవరి 12వ తేదీ (సోమవారం) ఉదయం 9. 25 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇండిగో విమానం ద్వారా బయలుదేరి, ఉదయం 10. 35 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి ఆయన వెంకటాచలం కు చేరుకుంటారు.