నెల్లూరు: లైంగిక దాడి కేసులో ఒకరు అరెస్టు

2చూసినవారు
నెల్లూరు: లైంగిక దాడి కేసులో ఒకరు అరెస్టు
మనుబోలు మండలంలో మానసిక వైకల్యం కలిగిన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడు బుడగ పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్సై రాకేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న నిందితుడు బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సోమవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్