ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం పైనంతపురం గ్రామపంచాయతీలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ద్విత్వా తుఫాను వల్ల జీవనోపాధి కోల్పోయిన చిన్న గిరిజన సంఘం కాలనీవాసులకు భోజన సదుపాయం కల్పించాలని మండల తాహసిల్దార్ స్వప్న చేసిన విజ్ఞప్తికి ప్రాజెక్ట్ యాజమాన్యం తక్షణమే స్పందించి, భోజన ఏర్పాట్లు చేపట్టింది. ఈ సహాయానికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.