పొదలకూరు పెద్ద మస్జీద్‌లో 20 ఏళ్లుగా అల్లాహ్ సేవలో తరించిన బాషా సాహెబ్ (80) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మౌలానా ముస్తక్ మదని వెల్లడించారు. పొదలకూరులో అందరికీ పరిచయమైన ఆయన నవ్వుతూ పలకరించే వ్యక్తిగా పేరుపొందారు. ఆయన మృతికి ముస్లిం సోదరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాషా సాహెబ్ అంతిమ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత జరగనుంది.