
వైద్య పరీక్షల్లో భారీ మాల్ ప్రాక్టీస్.. 20 మంది విద్యార్థులపై వేటు
అమరావతిలోని NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఫైనల్ పరీక్షల్లో భారీగా మాల్ ప్రాక్టీస్ బయటపడింది. చీటీలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలతో కాపీయింగ్ చేస్తూ 20 మంది వైద్య విద్యార్థులను అధికారులు గుర్తించారు. వీరిలో ముగ్గురు పరీక్ష రాస్తుండగా పట్టుబడ్డారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరీక్షల్లో పారదర్శకత విషయంలో రాజీ పడకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అవకతవకలకు పాల్పడిన విద్యార్థులను రెండేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డీబార్ చేసే అవకాశం ఉంది.




