పొదలకూరులో నిమ్మ రైతులకు ధరల షాక్

1చూసినవారు
పొదలకూరులో నిమ్మ రైతులకు ధరల షాక్
పొదలకూరు ప్రాంతంలో నిమ్మకాయ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కిలో రూ. 75 వరకు పలికిన ధర ప్రస్తుతం రూ. 20కు చేరింది. అధిక దిగుబడి, మార్కెట్లో సరఫరా పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్