వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అనుపల్లిపాడు సమీపంలో ఓ కంటైనర్ ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారు ముందు భాగం లారీ కిందకు వెళ్లిపోయింది. ఇదే సమయంలో వెనకాలే వస్తున్న మరో కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అంబులెన్స్ వాహనం సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని పోయింది. పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు