TP గూడూరు మండలం, పోట్లపూడి గ్రామంలో గురువారం కుక్కల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో దీప, బుట్టి ఈశ్వరమ్మ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కల గుంపు వారిపై దాడి చేసింది. బుధవారం రాత్రి గ్రామ వీ.ఆర్ తండ్రిని కూడా కుక్క కరిచినట్లు సమాచారం. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.