వెంకటాచలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో 'ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ డెవలప్మెంట్ – ఫ్రం ఐడియా టు ఎగ్జిక్యూషన్' పేరుతో వారం రోజుల సామర్థ్య నిర్మాణ సదస్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ ఆచార్య టీ. వీరారెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సును టూరిజం విభాగాధిపతి సుజాత సమన్వయం చేస్తున్నారు.