వెంకటాచలం: వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

1చూసినవారు
వెంకటాచలం: వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
వెంకటాచల మండలంలోని సీతారాంపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీ రమణ మాంబ వర్ధంతి సందర్భంగా విశేష అభిషేకాలు, తులసీదళార్చన, ప్రత్యేక అలంకరణ, గోవింద నామస్మరణలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు కొమ్మలపూడి గ్రామానికి చెందిన చెంబేటి భాస్కర్ కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్